TTD Sabha Parvam : జూలై 23న ముగియనున్న సభా పర్వం
టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
TTD Sabha Parvam : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ప్రతి రోజూ భిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా జూలై 1న సభా పర్వ పారాయణం ప్రారంభమైంది. ఇది నిరాటంకంగా కొనసాగుతూ వచ్చింది. ఈ కార్యక్రమం తిరుమల లోని నాద నీరాజనం వేదికపై ఏర్పాటు చేశారు. మహా భారతంలోని సభా పర్వ పారాయణం (సభా పర్వం – ధర్మ సారం ) జూలై 23న ఆదివారంతో ముగియనుంది.
TTD Sabha Parvam In Tirumala
ఇందులో 81 అధ్యాయాలు, 10 ఉపా పర్వాలు, 3,700 శ్లోకాలతో కూడిన సభా పర్వం శ్రీ కృష్ణుడి మహిమలను , సమాజానికి ధార్మిక సందేశాన్ని అందిస్తుంది. దీనిని నిత్య పారాయణం చేయడం వల్ల మనుషుల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందేందుకు దోహద పడుతుందని (TTD) భావించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
సభా పర్వ పారాయణం ప్రారంభమై వేలాది మంది భక్తులకు ఉపశమనం కలిగించేలా చేసింది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ వేంకటాచలపతి ప్రతి శ్లోకానికి అర్థాన్ని వివరించారు. శ్రీ రాఘవేంద్ర శ్లోక పారాయణం చేశారు. లక్షలాది మంది భక్తులు ఈ విశిష్టమైన కార్యక్రమాన్ని వీక్షించారు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు కోట్లాది మంది ఉన్నారు.
వారందరూ స్వయంగా తిరములకు రాలేరు. ఎప్పుడో ఒకసారి దర్శించుకుంటారు. వీరికి ప్రత్యక్ష భాగ్యాన్ని కల్పించే ఉద్దేశంతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతి రోజూ రాత్రి 8 నుండి 9 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.
Also Read : Tirumala Rush : తిరుమలలో 70 వేల పైగా భక్తుల రద్దీ