Tirumala Rush : శ్రీవారి కోసం పోటెత్తిన భక్తులు 70 వేళకి పైగా
తిరుమల హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుందే తప్పా ఎంతకూ తగ్గడం లేదు. గత 60 రోజులుగా ప్రతి రోజూ 70 వేల మందికి పైగా తిరుమలలో కొలువైన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తాజాగా శనివారం శ్రీవారి ప్రత్యేక రోజు కావడంతో స్వామి వారిని దర్శించు కోవాలని ఆరాట పడడం మామూలే. శ్రీనివాసుడికి ఈరోజు ప్రత్యేకం.
Tirumala Rush With Devotees
నిన్న ఒక్క రోజే శ్రీ వేంకటేశ్వర స్వామిని 84 వేల 430 మంది భక్తులు దర్శించుకున్నారు. 38 వేల 662 మంది భక్తులు శ్రీవారి కోసం తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదిలా ఉండగా భక్తులు శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ అలివేలు మంగమ్మలకు నిత్యం అందించే కానుకలు, విరాళాలు రూపేణా హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది.
భారీ ఎత్తున కానుకలు సమర్పించు కోవడం విశేషం. స్వామి వారి హుండీకి సంబంధించి 3 కోట్ల 45 లక్షల రూపాయలు సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
ఇదిలా ఉండగా తిరుమలలో ఏటీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు కంపార్ట్ మెంట్లలో. కాగా ఎటువంటి టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనం కోసం ఉన్నభక్తులకు కనీసం స్వామి వారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది టీటీడీ.
Also Read : AP CM YS Jagan : బస్సు ప్రమాదం జగన్ సంతాపం