Kakani Govardhan Reddy : ఆర్బీకేలు దేశానికి ఆదర్శం – కాకాణి
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం
Kakani Govardhan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి(Kakani Govardhan Reddy). ప్రకృతి వ్యవసాయాన్ని తాము ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Kakani Govardhan Reddy Said
రైతులకు ఉచితంగా పంటల బీమా , పట్టాల పంపిణీ , ఇన్ పుట్ సబ్సిడీ విధానం ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.
గతంలో ఏలిన టిడీపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించామని స్పష్టం చేశారు కాకాణి గోవర్దన్ రెడ్డి.
రైతులకు అన్ని రకాలుగా సహాయ , సహకారం అందించేందుకు గాను రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తోందని చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.
రైతులకు భరోసా ఇచ్చేందుకు తమ సర్కార్ కట్టుబడి ఉందన్నారు . ఇప్పుడు రైతులు నిశ్చింతగా సాగు చేయడంలో నిమగ్నమై ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి.
Also Read : TTD EO Dharma Reddy : సామాజిక..ధార్మిక కార్యక్రమాలపై ఫోకస్