Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి
గోదావరి నదికి పెరిగిన నీటి మట్టం
Srisailam Project : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఎడ తెరిపి లేకుండా వర్షాలు పడతాయని హెచ్చరించింది ఏపీ విపత్తుల రాష్ట్ర నియంత్రణ సంస్థ.
Srisailam Project Water
మరో వైపు కురుస్తున్న వర్షాల తాకిడికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది నదుల్లోకి. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ , ఇటు తెలంగాణలో నదులు, చెరువులు, కుంటలు , ప్రాజెక్టులు నిండు కుండల్నితలపిస్తున్నాయి. ఇక ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి.
కృష్ణా నది పరివాహకం లోని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి ప్రమాదకర స్థాయిని చేరుకుంది. రోజు రోజుకు నీటి మట్టం పెరగడం విశేషం. ఇక తాజాగా ఏపీలోని శ్రీశైలం ప్రాజెక్టుకు(Srisailam Project) వరద ప్రవాహం మొదలైంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో శ్రీశైలంకు 23 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
ఇదిలా ఉండగా శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 808.9 అడుగులుగా ఉంది. ఇక జూరాల జలాశయానికి 41 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 8.75 టీఎంసీలుగా ఉంది.
Also Read : Priyanka Gandhi : మోదీ..బాధ్యతల నుంచి పారిపోతే ఎలా