Janasena Slams Botsa : బొత్స చెప్పినవన్నీ అబద్దాలు
నిప్పులు చెరిగిన జనసేన పార్టీ
Janasena Slams Botsa : ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పై నిప్పులు చెరిగింది జనసేన(Janasena) పార్టీ. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదంటూ పేర్కొంది. ట్విట్టర్ వేదికగా సీరియస్ గా స్పందించింది. రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్ రావు ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన న్యాయ ప్రివ్యూ కమిటీ చైర్మన్ అని తెలిపింది. ఆయన 2019లో నియమితులయ్యారు. జేపీసీ చైర్మన్ బిడ్డర్ ల ఎంపికకు బాధ్యత వహించరని స్పష్టం చేసింది జనసేన పార్టీ.
Janasena Slams Botsa Satyanarayana
సదరు కంపెనీకే ఎందుకు టెండర్ ను అప్పగించారో మంత్రి చెప్పలేదని మండిపడింది. మీ నకిలీ మేధో పరమైన పదజాలంతో సాధారణ ప్రజలను గందర గోళానికి గురి చేయొద్దంటూ సూచించింది. 2019-20లో 63 వేల 824 పాఠశాలలు ఉంటే 2022-23లో 59 , 186కి ఎందుకు తగ్గాయో చెప్పాలని డిమాండ్ చేసింది. 2020-21తో పోలిస్తే 2021-22 లో ప్రీ ప్రైమరీ స్థాయిలో నమోదులో 61 శాతం క్షీణించిందని , ప్రభుత్వ బడుల్లో 90 శాతం తగ్గుదల ఎందుకు జరిగిందో స్పష్టం చేయాలని కోరింది.
2021-22 డేటా ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 39,000 టీచర్ పోస్టులు , ఉన్నత పాఠశాలల్లో 11,888 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. ఇంత వరకు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించింది జన సేన పార్టీ.
Also Read : Manipur Women Slams : మణిపూర్ పై మాట్లాడేందుకు 3 నెలలా