Nara Lokesh : రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి గురించి ఏపీ సీఎం జగన్ రెడ్డి పట్టించు కోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువ గళం పాదయాత్ర సందర్భంగా ఆదివారం మార్కాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. తలమళ్ల క్యాంపు సైట్ వద్ద పొగాకు రైతులతో ముఖా ముఖి నిర్వహించారు నారా లోకేష్.
Nara Lokesh Words
పొగాకు రైతులకు సంబంధించి పెట్టుబడి బాగా పెరిగిందన్నారు. కేవలం 36.5 టన్నులకు మాత్రమే పొగాకు బోర్డు అనుమతి ఇస్తుందని తెలిపారు. కనీసం 50 టన్నులు అమ్ముకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొగాకు పంటకు బీమా సౌకర్యం లేక పోవడం వల్ల అకాల వర్షాలు వస్తే తీవ్రంగా నష్ట పోతారని ఆవేదన చెందారు నారా లోకేష్.
పొగాకు రైతులకు పెట్టుబడి భారీగా పెరిగిందని, ఎరువుల ధర కూడా మోయలేనంతగా మారిందన్నారు నారా లోకేష్. ఇదిలా ఉండగా రైతులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు నారా లోకేష్(Nara Lokesh). జగన్ సర్కార్ ఒక్క పైసా పరిహారం ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఇకనైనా సర్కార్ మారాలన్నారు. పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు.
సాగు చేసిన పొగాకు స్టాక్ పెట్టుకునేందుకు షేడ్స్ ఏర్పాటుకు సబ్సిడీలు అందించాలని అన్నారు. రాయలసీమ రైతాంగంతో పాటు మెట్ట ప్రాంతం రైతులకు జీవనాడి డ్రిప్ ఇరిగేషన్ అని పాదయాత్ర చేసిన జగన్ కు తెలుసన్నారు. సీఎం అయ్యాక డ్రిప్ పై సబ్సిడీ ఎందుకు ఎత్తేశారో ఇప్పటికీ తెలియదన్నారు నారా లోకేష్.
Also Read : Pilli Subhash Chandra Bose : మంత్రిపై ఎంపీ పిల్లి కామెంట్స్