Botsa Satyanarayana : పవన్ ఆరోపణలు అవాస్తవం – బొత్స
విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టాం
Botsa Satyanarayana : ఏపీలో విద్యా రంగంలో మౌలిక వసతులు కల్పించ లేదని, వేలాదిగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో టెండర్ లో ఏకపక్షంగా బైజూస్ స్టార్టప్ కంపెనీకి వందల కోట్లు ఎలా అప్పగించారంటూ ప్రశ్నించారు. దీనిపై తీవ్ర రాద్ధాంతం చోటు చేసుకుంది.
Botsa Satyanarayana Fire On Pawan Kalyan
జనసేన పార్టీ చీఫ్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ట్విట్టర్ వేదికగా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్లున్న కబోధి పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు బొత్స సత్యనారాయణ.
ఎవరో స్క్రిప్టు రాసిస్తే చదివే అలవాటు కలిగిన పవన్ కళ్యాణ్ కు నిరాధార విమర్శలు చేయడం అలవాటుగా మారిందన్నారు. అవసరమైతే తాను పాఠాలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని, మరి పవన్ హోం వర్క్ చేసేందుకు సమ్మతమేనా అని సవాల్ విసిరారు.
తమ సర్కార్ ప్రవేశ పెట్టిన నాడు నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు విద్యా శాఖ మంత్రి. ఇక నుంచి ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు బొత్స.
Also Read : Manipur Violence Comment : మణిపూర్ ఫైల్స్ పై మౌనమేల