Byreddy Rajasekhar Reddy : తీగల వంతెనను అడ్డుకుంటాం
బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
Byreddy Rajasekhar Reddy : ప్రముఖ రాయలసీమ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇప్పటికే రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన రెడ్డి ప్రస్తుతం తీగల వంతెన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Byreddy Rajasekhar Reddy Words
తెలంగాణలో ఉన్న సోమశిల – ఆంధ్రాలో ఉన్న సిద్దేశ్వరం గుట్టల మధ్య రూ. 1500 కోట్లతో తీగల వంతెన నిర్మించేందుకు కేంద్రం సమ్మతించింది. ఈ మేరకు కేంద్ర జాతీయ రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. దీనిపై కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Byreddy Rajasekhar Reddy) తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.
తమ పార్టీకి చెందిన కేంద్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాయలసీమ వాసులకు కావాల్సింది బ్రిడ్జి, బ్యారేజ్ కానీ తీగల వంతెన కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మించేందుకు తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కావాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అడుగు ముందుకు వేస్తే అడ్డుకుని తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
Also Read : Botsa Satyanarayana : పవన్ ఆరోపణలు అవాస్తవం – బొత్స