Jairam Ramesh Modi : మోదీ మౌనం వీడక పోతే ఎలా
మణిపూర్ పై ఇంకా మౌనం ఎందుకు
Jairam Ramesh Modi : కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ గత మే 3వ తేదీ నుంచి మండుతోందని ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు.
పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సభలో ప్రకటన చేయాలని విపక్షాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు జైరాం రమేష్(Jairam Ramesh).
Jairam Ramesh Modi Speaks
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పదవులలో కొనసాగుతుండడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని ప్రకటన చేయాలని కోరినా తప్పించుకు తిరుగుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు జైరాం రమేష్.
ఇవాళ యావత్ భారతం తల దించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తించడం ప్రధానికి తగదని హితవు పలికారు. 26 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం తెలిపారు. సోమవారం ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగాయి.
Also Read : Bandi Sanjay : అమిత్ షాతో బండి భేటీ