Sanjay Singh Suspended : ఎంపీ సంజయ్ సింగ్ పై వేటు
పార్లమెంట్ సమావేశాల నుంచి బహిష్కరణ
Sanjay Singh Suspended : మణిపూర్ లో చోటు చేసుకున్న హింసపై పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఆయా పార్టీలకు చెందిన నేతలు, ఎంపీలు నిలదీశారు. సోమవారం ప్రధానిపై నిప్పులు చెరిగారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్. ఆయన పదే పదే మోదీ ఎక్కడ అంటూ నిలదీశారు. ఇవాళ యావత్ దేశంతో పాటు ప్రపంచం కూడా మణిపూర్ లో చోటు చేసుకున్న దారుణాల గురించి ప్రశ్నిస్తోందని, నిలదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Sanjay Singh Suspended For Manipur
ఒక బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh). ఇవాళ తమ పార్టీ పూర్తిగా ఖండిస్తోందని పేర్కొన్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ సంజయ్ సింగ్.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ చైర్మన్ , భారత దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్. సభా సమావేశాలకు ఆటంకం కలిగించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆప్ ఎంపీ పై. చివరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపాదన చేయడంతో..సంజయ్ సింగ్ ను పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. న్యాయం కోసం అడగడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
Also Read : Raghav Chadha : చీకట్లో ప్రజాస్వామ్యం – రాఘవ్ చద్దా