Arvind kejriwal : మణిపూర్ పై మోదీ మౌనం దారుణం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind kejriwal : ఓ వైపు మండుతోంటే ఇంకో వైపు ప్రధాన మంత్రి మోదీ మౌనంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మంది నిరాశ్రయులుగా మారారు. చాలా మంది లెక్కల్లోకి రాకుండా పోయారు. కేవలం మనుషుల మధ్య విభేదాలను రాజేసి దాడులకు పాల్పడడం నీచాతి నీచమని అన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Arvind Kejriwal Words
బాధ్యత కలిగిన సీఎం , ప్రధాని ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇలా జరుగుతోందన్న దానికి సమాధానం ఇవ్వక పోవడం సమస్యను పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదన్నారు సీఎం.
రోమ్ నగరం తగలబడి పోతుంటే ఫిడేల్ వాయించుకు కూర్చున్నట్లు ప్రధాన మంత్రి మోదీ అలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ సభ్య సమాజం తలవంచుకుని నిలబడ్డది. ఇందులో కార్గిల్ లో పాల్గొన్న మాజీ సుబేదార్ భార్య కూడా ఉండడం తనను కంట తడి పెట్టించేలా చేసిందన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇకనైనా మోదీ బయటకు రావాలి. లేక పోతే ఆయనే బాధ్యత వహించక తప్పదని తెలుసు కోవాలి.
Also Read : Sanjay Singh : మణిపూర్ హింసపై మాటల్లేవ్