KTR BUS Viral : హైదరాబాద్ లో ‘కేటీఆర్ బస్సు’ హల్ చల్
బీఆర్ఎస్ యూత్ లీడర్ అర్వింద్ అలిశెట్టి
KTR BUS Viral : ఒక్కొక్కరిది ఒక్కో పంథా. తెలంగాణలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. భావి సీఎంగా ఇప్పటికే పేరు పొందారు సీఎం కేసీఆర్ తనయుడు ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్). ఆయన తనయుడు హిమాంశు రావు కూడా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఓ స్కూల్ ను దత్తత తీసుకున్నాడు. దానిలో మౌలిక వసతులను కల్పించాడు.
KTR BUS Viral News
ఇదే సమయంలో ఇవాళ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఆయనకు బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారు. కానీ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన యూత్ లీడర్ అరవింద్ అలిశెట్టి వినూత్నంగా ఆలోచించారు. తన అభిమాన నాయకుడు కేటీఆర్ సైతం విస్తు పోయేలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడు.
కేటీఆర్ మంత్రిగా సాధించిన విజయాలను ప్రజలకు తెలియ చేయాలని అనుకున్నాడు. ఇందుకు బస్సు అయితేనే ప్రజల్లోకి చేరువ కాగలుతుందని నమ్మాడు. ఇంకేం కొత్త బస్సును(KTR BUS Viral) అందంగా ముస్తాబు చేయించాడు. ఆపై బస్సు లోపట, బయట అంతా కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, విజయాలను ప్రతిఫలించేలా చేశాడు.
ఈ బస్సు హైదరాబాద్ నగరం అంతటా 10 రోజుల పాటు తిరుగుతుంది. దీని వల్ల చాలా మంది ప్రజలకు తెలుసు కోవాలన్న ఉత్సుకత కలుగుతుంది. ఇదే సమయంలో ఎలాంటి ఖర్చు చేయకుండానే ఆశించిన దానికంటే ప్రచారం కూడా లభిస్తుంది. మొత్తంగా కేటీఆర్ బస్సు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : Bibi Nagar AIIMS : బీబీనగర్ ఎయిమ్స్ కు రూ. 1365 కోట్లు