Gaurav Gogoi : మోదీ మౌనం వీడితే బెటర్ – గొగోయ్
ప్రధానమంత్రిపై భగ్గుమన్న ఎంపీ
Gaurav Gogoi : లోక్ సభ కాంగ్రెస్ లీడర్ , ఎంపీ గౌరవ్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ లో చోటు చేసుకున్న దారుణాల గురించి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో దేశానికి బాధ్యత వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ హింసోన్మాదంపై మాట్లాడక పోవడం దారుణమన్నారు.
Gaurav Gogoi Speaks
వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత , జాతికి వివరణ ఇచ్చు కోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉందన్నారు. ఆయన ఒక పార్టీకి చెందిన నాయకుడు కావచ్చు. కానీ ఆయన దేశానికి పీఎం అన్న సంగతి ముందు గుర్తు పెట్టుకోవాలని అన్నారు గౌరవ్ గొగోయ్(Gaurav Gogoi).
ఇప్పటి వరకు చోటు చేసుకున్న దారుణాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది మోదీనేనని స్పష్టం చేశారు. మణిపూర్ గురించి ప్రశ్నిస్తే చట్ట సభకు ఎన్నికైన సభ్యులను సస్పెండ్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ.
ఒక రకంగా ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజుగా అనుకోవడమేనని పేర్కొన్నారు గౌరవ్ గొగోయ్. ఇకనైనా మోదీ మారాలని సూచించారు. లేక పోతే దేశం క్షమించదన్నారు.
Also Read : Allu Arjun Record : థ్రెడ్స్ యాప్ లో బన్నీ రికార్డ్