Congress Slams BRS : ఏం సాధించారని వీక్షిస్తున్నారు

బీఆర్ఎస్ మంత్రుల‌పై కాంగ్రెస్

Congress Slams BRS : తెలంగాణ‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. సామాజిక మాధ్య‌మాల‌లో మీమ్స్ ల‌తో హోరెత్తి పోతున్నాయి. ఇక నిన్న‌టి దాకా ప‌డుతూ లేస్తూ వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఆపార్టీలోకి వ‌ల‌స‌లు ఎక్కువ‌య్యాయి. మ‌రో వైపు అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి నుంచి కొంద‌రు నేత‌లు ప‌క్క పార్టీల వైపు చూడ‌డం కూడా ఒకింత విస్తు పోయేలా చేస్తోంది.

Congress Slams BRS To

ఈ త‌రుణంలో టీపీసీసీ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ అరుదైన ఫోటోను పంచుకుంది. మంత్రి కేటీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మంత్రులు త్రీడీ అద్దాలు పెట్టుకుని చూడ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. తోటి మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను అవ‌మాన ప‌రిచిన సంఘ‌ట‌న‌ల‌ను, క‌విత లిక్క‌ర్ స్కాం నుండి బ‌య‌ట ప‌డిన విధానాన్ని చూస్తున్నారా అని ప్ర‌శ్నించింది కాంగ్రెస్(Congress) పార్టీ.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా సంపాదించిన ల‌క్ష కోట్ల అవినీతిని, భూములు క‌బ్జా చేసి 30 శాతం క‌మీష‌న్లు నొక్కేసిన దానిని, బీజేపీ, మోడీ మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాల‌ను తిల‌కిస్తున్నారా అంటూ నిల‌దీసింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు కేటీఆర్ బ‌ర్త్ డేను జ‌రుపుకుంటున్నారా అంటూ సెటైర్ వేసింది.

Also Read : CM KCR : సీఎం కేసీఆర్ ఖుష్ క‌బ‌ర్

 

Leave A Reply

Your Email Id will not be published!