Raghav Chadha : మణిపూర్ లో చోటు చేసుకున్న దారుణాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారనే దానిపై ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా(Raghav Chadha). పార్లమెంట్ లో చర్చకు పట్టుపట్టినా ప్రభుత్వం ఒప్పుకోక పోవడం దారుణమని పేర్కొన్నారు.
Raghav Chadha Asking
అటు కేంద్రంలో ఇటు మణిపూర్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఎందుకని చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యాయంటూ ఆప్ ఎంపీ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 , ఆర్టికల్ 356 గురించి కనీసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు రాఘవ్ చద్దా.
ఏదైనా రాష్ట్రంలో అంతర్గత వైరుధ్యం ఏర్పడితే శాంతి, సామరస్యాన్ని పునరుద్దంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని స్పష్టంగా ఉందని పేర్కొన్నారు ఎంపీ. కానీ వీటిని కావాలని మోదీ సర్కార్ పక్కన పెట్టిందంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్ర గవర్నర్ పరిస్థితిని రాష్ట్రపతికి, కేంద్ర సర్కార్ కు తెలియ చేస్తే రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్ లేక పోలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి పూర్తి బాధ్యత వహించాల్సింది మోదీనేనని మండిపడ్డారు రాఘవ్ చద్దా.
Also Read : Congress Slams BRS : ఏం సాధించారని వీక్షిస్తున్నారు
