Kumbham Anil kumar Reddy : కోమ‌టిరెడ్డి వల్లే పార్టీ మారా

కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Kumbham Anil kumar Reddy : భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నిర్వాకం వ‌ల్ల‌నే తాను కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వ‌చ్చింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు యాదాద్రి జిల్లా డీసీసీ మాజీ చీఫ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbham Anil Kumar Reddy). ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన విద్యా శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు చేరుకున్నారు. అక్క‌డ సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్నారు.

Kumbham Anil Kumar Reddy Said

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఎంపీ కోమ‌టిరెడ్డిపై నిప్పులు చెరిగారు. నాతో పెట్టుకుంటే బాగుండ‌దంటూ తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డా. కానీ ఎక్క‌డా త‌న‌ను ఎద‌గ‌నీయ‌కుండా అడ్డుకుంటూ వ‌చ్చాడు వెంక‌ట్ రెడ్డి అంటూ మండిప‌డ్డాడు. త‌న ఇమేజ్ కోసం పార్టీని తాక‌ట్టు పెట్టాడంటూ ఆరోపించారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.

కేవ‌లం త‌న‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తూ వ‌చ్చాడ‌ని వాపోయాడు. చివ‌ర‌కు త‌న‌ను త‌ప్పించేందుకు కొత్త‌గా బీసీ నినాదం ముందుకు తీసుకు వ‌చ్చాడ‌ని ధ్వ‌జ‌మెత్తాడు. కోమ‌టిరెడ్డి కుటుంబానికే టికెట్లా అని నిల‌దీశారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపుల‌ను ప్రోత్స‌హిస్తూ వ‌చ్చాడ‌ని, అందుకే ఉండ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. చివ‌ర‌కు బీఆర్ఎస్ లో చేరాల్సి వ‌చ్చింద‌న్నారు.

Also Read : Heavy Rains Telangana : తెలంగాణ‌లో రెడ్ అల‌ర్ట్

Leave A Reply

Your Email Id will not be published!