Heavy Rains IMD : గత కొంత కాలంగా వరుణుడు రాలేదంటూ వాపోయిన తెలంగాణ వాసులకు ఇప్పుడు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పరేషాన్ అవుతున్నారు. ఎక్కడ చూసినా వర్షమే. కుండ పోతగా కురుస్తున్న వర్షాల తాకిడికి తట్టుకోలేక పోతున్నారు.
Heavy Rains IMD HYD
హైదరాబాద్ నగరం విల విల లాడుతోంది. ట్రాఫిక్ జామ్ తో సతమతం అవుతోంది. భారీ వర్షాలు(Heavy Rains) వెంటాడుతున్నాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. అయినా జనం బయటకు వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్ల మీదనే నిలిచి పోయాయి. వచ్చే శుక్రవారం దాకా అప్రమత్తంగా ఉండాలని లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అత్యంత అవసరమైతే తప్ప బయటకు రావద్దని , ముందు జాగ్రత్తగా మెడిసిన్స్ ,ఇతర వస్తువులు అవసరం అనుకుంటే తెచ్చుకోవాలని సూచించింది. మరో వైపు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు సంబంధించి పని వేళలను మార్చింది. 9.45 నుంచి సాయంత్రం 4.15 నిమిషాల వరకు మాత్రమే నిర్వహించాలని ఆదేశించింది. భారీ వర్షాల తాకిడి నుంచి తట్టుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.
Also Read : Heavy Rains Hyderabad : భాగ్యనగరం అతలాకుతలం