VRAs CM KCR : ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల్సి వస్తే రాజకీయాలలో ఎవరికీ అందని నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు ఇప్పటి వరకే ఆలోచిస్తే ఆయన మాత్రం మరో 20 ఏళ్ల ముందు ఆలోచిస్తారు. అందుకే ఆయన ఉద్యమ నేతగా సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు నామ మాత్రంగా ఉండి పోయారు. కేవలం ఆరోపణలు, విమర్శలకే పరిమితం అయ్యారు.
VRAs CM KCR Good News
తాజాగా సంచలన ప్రకటన చేశారు కేసీఆర్(KCR). త్వరలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆందోళన బాట పట్టిన వీఆర్ఏలకు ఖుష్ కబర్ చెప్పారు. వారంతా తాతల, తండ్రుల కాలం నుంచి తర తరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పని చేస్తున్నారు.
ఇదిలా ఉండగా వారందరికీ కేసీఆర్ తీపి కబురు చెప్పారు. గ్రామ సహాయకులుగా పని చేస్తున్న వీఆర్ఏలకు పే స్కేల్ ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంటనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.
దీంతో సచివాలం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ కు పాలాభిషేకం చేశారు.
Also Read : CM KCR : కుంభంకు కేసీఆర్ భరోసా