Elon Musk Twitter : టెస్లా చైర్మన్ , ట్విట్టర్ సిఇఓ ఎలోన్ మస్క్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన రోజు రోజుకు ట్విట్టర్ ను ఏం చేస్తున్నారనే ఆందోళన మొదలైంది. మైక్రో బ్లాగింగ్ సైట్ గా పేరు పొందింది ట్విట్టర్. ఇది కోట్లాది మందిని ఒకే చోటుకు చేర్చడంలో, సమస్త సమాచారాన్ని పంచుకోవడంలో, ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరిగే వింతలు, విశేషాలు తెలియ చేయడంలో అద్భుతంగా పని చేస్తోంది.
Elon Musk Twitter Changes
ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు వచ్చాయి. కానీ ట్విట్టర్ దరి దాపుల్లోకి రాలేక పోయాయి. ఇటీవలే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్స్ ను తీసుకు వచ్చాడు. ఇది కూడా దూసుకు పోతోంది.
అయితే భారీ ధరకు కొనుగోలు చేశాడు టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Musk Twitter). ఆయన ఫోకస్ అంతా స్పేస్ ఎక్స్ , ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఉంది. ఇప్పటికీ ఆయన రారాజుగా వెలుగొందుతున్నాడు. బిలియనీర్ ల జాబితాలో టాప్ లో కొనసాగుతున్నాడు. కానీ ఉన్నట్టుండి పనిగట్టుకుని ట్విట్టర్ ను తీసుకోవడంతో యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది.
ఆ వెంటనే కీలక మార్పులకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై భగ్గుమంటున్నారు నెటిజన్లు. ట్విట్టర్ లోగోకు మంగళం పాడాడు. ఎక్స్ ను చేర్చాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
Also Read : Twitter Logo Change : ట్విట్టర్ లోగో మార్పుపై ఫైర్