AIMIM Support : అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం మద్ధతు
కేంద్ర సర్కార్ కు తాము వ్యతిరేకం
AIMIM Support : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. తాము మోదీ సర్కార్ కు బి టీమ్ కాదంటూ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఓవైసీ(Adaduddin Owaisi). ఇందులో భాగంగా స్పీకర్ ఓం బిర్లా చేతులు లేపి సపోర్ట్ ఇవ్వాలంటూ కోరారు. ఈ మేరకు ఎంఐఎం ఎంపీలు ఇద్దరు బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు సభా సాక్షిగా ప్రకటించారు.
AIMIM Support Rule
2019లో ఉపా సవరణ బిల్లుపై ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని , కానీ తాము పూర్తిగా కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్నామని దీని ద్వారా తేలి పోయిందన్నారు. ప్రతిపక్షాలు , ఇతరులు ఎంఐఎం మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు పదే పదే ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ దేశంలో ఎవరు అసలు, సిసలైన వారో, ప్రజల వైపు ఎవరు నిలబడ్డారో తేలి పోయిందన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. ఇదే వైఖరి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. తాము ప్రజల తరపున వాయిస్ వినిపిస్తూనే ఉంటామని ఇందులో ఎలాంటి వెనుకంజ వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ ఎంపీ. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : Sanjay Singh : మోదీ నిర్వాకం మణిపూర్ కు శాపం