India Protest : ఎంపీల వినూత్న నిరసన
మోదీ మౌనం వీడాలని ఆందోళన
India Protest : దేశంలోని మణిపూర్ రగులుతోంది. హింసోన్మాదంతో అట్టుడుకుతోంది. ఇప్పటి వరకు 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మంది దాకా గాయపడ్డారు. 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. గత మే 3 నుంచి వరుసగా అత్యాచారాలు, అల్లర్లు, హత్యలతో , గృహ దహనాలతో తల్లడిల్లుతోంది. దీనిపై చర్చకు పట్టుపట్టాయి పార్లమెంట్ లో ప్రతిపక్షాలు. కానీ ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ ఎలాంటి సమాధానం ఇచ్చేందుకు సమ్మతించ లేదు.
India Protest Manipur
కేంద్రంలో, మణిపూర్ లో భారతీయ జనతా పార్టీ కొలువు తీరినా ఎందుకని స్పందించడం లేదంటూ ప్రశ్నించారు 26 పార్టీలకు చెందిన ఎంపీలు. మరో వైపు కేంద్ర సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్(Congress) పార్టీలు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సభకు భంగం కలిగిస్తున్నారంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ వేటు వేశారు. ఈ పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకు ఆయనను అనుమతించ బోబంటూ ప్రకటించారు.
పార్లమెంట్ భవనం ప్రాంగణంలో ఎంపీలు సంజయ్ సింగ్ కు మద్దతు తెలిపారు. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. గురువారం ఎంపీలు నల్ల దుస్తులు ధరించి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మోదీ మౌనం వీడేంత వరకు తాము ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Also Read : Akhilesh Yadav : ఇంకెంత కాలం మౌనంగా ఉంటారు