Farooq Abdullah : మణిపూర్ పాపం మోదీదే – అబ్దుల్లా
ఎందుకు మౌనం వహించారో చెప్పాలి
Farooq Abdullah : మణిపూర్ లో చోటు చేసుకున్న హింసకు పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనేనని స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా . గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం, సస్పెండ్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని స్పష్టం చేశారు ఫరూక్ అబ్దుల్లా.
Farooq Abdullah Says
మణిపూర్ పై ఇప్పటి దాకా సరైన వివరాలు లేవన్నారు. ఎంత మంది చని పోయారు. ఎంత మంది గాయపడ్డారు. ఎంత మంది నిరాశ్రయులయ్యారనే దాని గురించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వక పోవడం నేరమేనంటూ మండిపడ్డారు. ఇది మోదీకి తగదన్నారు.
ఒక బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి పదవి లో ఉన్న వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేది అంటూ సీరియస్ అయ్యారు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah). అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చిన మణిపూర్ సీఎంను , బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మణిపూర్ ప్రజల పక్షాన తన గొంతుకను వినిపించే ప్రయత్నం చేసిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పై విధించిన సస్పెన్షన్ ను కూడా ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓ వైపు రాష్ట్రం కాలిపోతుంటే పట్టించు కోకుండా విదేశాలు ఎలా పర్యటిస్తారంటూ నిలదీశారు ఫరూక్ అబ్దుల్లా.
Also Read : Hyderabad Red Alert : హైదరాబాద్ కు రెడ్ అలర్ట్