SCR Cancels : భారీ వ‌ర్షాలు ప‌లు రైళ్లు ర‌ద్దు

ప్ర‌క‌టించిన రైల్వే శాఖ

SCR Cancels : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం కార‌ణంగా పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి వాగులు, కుంట‌లు, చెరువులు, న‌దులు పొంగి పొర్లుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. వ‌రంగ‌ల్ లోని కాజిపేట రైల్వే జంక్ష‌న్ లోకి నీళ్లు చేరాయి. ట్రాక్ పై వ‌రద నీరు పోటెత్తింది. దీంతో ఈ రూట్ లో రైళ్ల‌ను తాత్కాలికంగా నిలిపి వేసింది కేంద్ర రైల్వే శాఖ‌(SCR Cancels).

SCR Cancels Trains

మూడు రైళ్ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. ఇదే స‌మ‌యంలో నాలుగు రైళ్ల‌ను పాక్షికంగా ర‌ద్దు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా 11 రైళ్ల‌ను వ‌ర్షాల తాకిడి కార‌ణంగా దారి మ‌ళ్లించిన‌ట్లు వెల్ల‌డించింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే.

ఇదిలా ఉండ‌గా 17012 నెంబ‌ర్ క‌లిగిన సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు, 17233 నెంబ‌ర్ క‌లిగిన సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ వెళ్లే ట్రైన్ , 17234 నెంబ‌ర్ క‌లిగిన సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

పాక్షికంగా ర‌ద్ద‌యిన రైళ్ల‌లో 12761 నెంబ‌ర్ క‌లిగిన తిరుప‌తి నుంచి క‌రీంన‌గ‌ర్ కు వెళ్లే ట్రైన్ , 12762 నెంబ‌ర్ క‌లిగిన క‌రీంన‌గ‌ర్ నుంచి తిరుప‌తి కు వెళ్లే రైలు, 12757 నెంబ‌ర్ క‌లిగిన సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ కు వెళ్లే రైళ్ల‌ను పాక్షికంగా ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది రైల్వే శాఖ‌.

Also Read : Dharmapuri Arvind : మా నాయిన కాంగ్రెస్ పార్టీకి పెద్ద‌న్న‌

Leave A Reply

Your Email Id will not be published!