Daggubati Purandeswari : ఏపీ అప్పుల కుప్పపై ఫిర్యాదు
నిర్మలను కలిసిన పురంధేశ్వరి
Daggubati Purandeswari : ఏపీ రాజకీయాలలో ఇప్పటి దాకా స్తబ్దుగా ఉన్న భారతీయ జనతా పార్టీలో కదలిక వచ్చేలా చేశారు ప్రస్తుతం కొత్తగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి. ఆమె తండ్రి ఉమ్మడి ఎపీకి సీఎంగా పని చేశారు. ప్రముఖ నటుడు దివంగత నందమూరి తారక రామారావు. తండ్రి ఆశయాలను పుణికి పుచ్చుకున్న ఆమె కొంత కాలం పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. రాజకీయాలలో అపారమైన అనుభవం ఉంది దగ్గుబాటి పురందేశ్వరికి. ఇదే సమయంలో కాంగ్రెస్ పవర్ లోకి రాదని తెలుసుకున్న వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరారు. కీలకమైన నాయకురాలిగా ఎదిగారు.
Daggubati Purandeswari Gives
తాజాగా త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఊహించని రీతిలో దగ్గుబాటి పురందేశ్వరికి(Daggubati Purandeswari) పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన వెంటనే దూకుడు పెంచారు. రాష్ట్రంలో పార్టీ శ్రేణులు, నాయకులకు స్పష్టమైన సందేశాన్ని పంపించారు.
పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీ సర్కార్ పై, సీఎం జగన్ రెడ్డిపై నిర్మాణాత్మకమైన రీతిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం ఏపీ సర్కార్ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేసిందని , దీనిపై ఫోకస్ పెట్టాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Also Read : KTR Appeal : అండగా నిలవండి సాయం చేయండి