Smriti Irani : రాహుల్ పై భగ్గుమన్న స్మృతీ ఇరానీ
ఛత్తీస్ గఢ్ ..బీహార్ లలో మాటేంటి
Smriti Irani : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా ఆమె ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. పదే పదే మణిపూర్ పై నోరు పారేసుకుంటున్న వారికి తాను ఒక్కటే చెప్పదల్చుకున్నానని అన్నారు. ప్రతిపక్షాల కూటమి ఇండియా దేని కోసం ఆందోళన చేపడుతున్నదో దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు స్మృతీ ఇరానీ.
Smriti Irani Said
కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ పార్టీలు ఏలుబడిలో ఉన్న బీహార్, ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో మహిళలకు రక్షణ అనేది ఉందా అని ప్రశ్నించారు. ముందు మీ వైపు తప్పులు పెట్టుకుని తమను అంటే ఎలా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
విచిత్రం ఏమిటంటే మణిపూర్ లో హింసోన్మాదానికి కారణం తాము కాదన్నారు. ప్రతిపక్షాలేనంటూ వితండ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు స్మృతీ ఇరానీ(Smriti Irani). కేంద్ర సర్కార్ ను, ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు.
మణిపూర్ దారుణాలపై బీజేపీకి చెందిన సంకీర్ణ సర్కార్ లో కొలువు తీరిన మహిళా మంత్రులు నోరు విప్పరా అంటూ కాంగ్రెస్ ఎంపీ అమీ యాజ్ఞిక్ ప్రశ్నించారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి.
Also Read : Dhanush Birthday : ధనుష్ కలకాలం జీవించు