BJP Spokes Person Resign : మణిపూర్ హింసకు మోదీనే కారణం
బీజేపీ స్పోక్స్ పర్సన్ రాజీనామా
BJP Spokes Person Resign : భారతీయ జనతా పార్టీకి బీహార్ లో బిగ్ షాక్ తగిలింది. మణిపూర్ లో చోటు చేసుకున్న హింస, అల్లర్లకు ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వినోద్ శర్మ(Vinod Sharma). తాను ఈ ఘోరాలను చూసి తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
BJP Spokes Person Resign His Position
ఈ సందర్బంగా ప్రధానమంత్రిపై నిప్పులు చెరిగారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీజేపీలో చర్చకు దారి తీశాయి. మణిపూర్ హింసోన్మాదానికి ప్రధాన కారకులు ప్రధాని మోదీ , ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ లే కారణమని ఆరోపించారు.
వినూత్నంగా నిరసన తెలిపారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రిజైన్ చేయడం విశేషం. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వల్ల అంతర్జాతీయంగా భారత దేశం పరువు పోయిందన్నారు. బేటీ బచావో బేడీ పడావో అంటూ సనాతన ధర్మం గురించి మాటలు చెబుతారు..కానీ ఇలా మహిళలను అవమానానికి గురి చేసి నగ్నంగా ఊరేగించమని ఏ ధర్మం చెప్పిందని ప్రశ్నించారు వినోద్ శర్మ.
నేను ఢిల్లీకి వెళ్లాను. అక్కడ 5 రోజులు ఉన్నా. ఈ ఘటనకు సంబంధించి మద్దతుగా మాట్లాడాలని సూచించారు. కానీ నా మనస్సు ఒప్పుకోలేదు. అందుకే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
Also Read : CM KCR : భారీ వర్షం జర భద్రం – కేసీఆర్