AAP Water ATMs : దాహార్తి తీర్చుతున్న ఆప్ వాటర్ ఏటీఎంలు
ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయానికి జనం ఫిదా
AAP Water ATMs : ఢిల్లీలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే వర్షాలు, వరదల తాకిడికి దేశ రాజధాని తల్లడిల్లింది. ఎక్కడికక్కడ రాజధాని వాసులు నానా తంటాలు పడ్డారు. ప్రత్యేకించి పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు నీటి కొరతతో నానా ఇక్కట్లకు గురయ్యారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
AAP Water ATMs Started
నగర వాసులకు మేలు చేకూర్చేలా ఏకంగా పరిశుద్ధమైన నీటిని అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఏటీఎం కార్డులను అందజేశారు. వీటిని ప్రతి ఇంటికి ఇచ్చారు. అవసరమైన సమయంలో నీళ్ల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. నీటి ఏటీఎం కార్డును స్వీప్ చేస్తే చాలు వెంటనే బిందెడు నీళ్లు వస్తాయి. ప్రస్తుతం ఢిల్లీలో 500 మంచినీళ్లకు సంబంధించి ఏటీఎంలను ఏర్పాటు చేశారు సీఎం.
కాగా ఈ ఏటీఎంల నుంచి రోజుకు ఒక కుటుంబం 20 లీటర్ల నీటిని తీసుకునేందుకు వీలుగా దీనిని రూపొందించారు. నగరంలోని ప్రతి ఒక్కరికీ ఈ కార్డు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు సీఎం. మురికి వాడలు, ఇతర జనసాంధ్రత ఉన్న ప్రాంతాలలో ప్రజలకు మేలు చేకూర్చేలా శుద్ధి చేసిన పరిశుభ్రమైన నీటిని అందజేయనున్నట్లు తెలిపారు.
Also Read : Raghav Chadha : చట్టాలను ఉల్లంఘించిన కేంద్రం