Blue Whale AP : కొట్టుకు వచ్చిన నీలి తిమింగలం
సంతబొమ్మాలి మండలం సముద్రతీరం
Blue Whale AP : బంగళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం అతలాకుతలం చేస్తోంది. వాయు గుండంగా మారి గండాన్ని తెస్తోంది. ఎక్కడ చూసినా వానలే. నదులు ప్రవహిస్తున్నాయి. కృష్ణా , గోదావరి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఓ వైపు వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ల వద్దని కోరింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టింది.
Blue Whale AP Beach
ఇదిలా ఉండగా అరుదైన దృశ్యం ఏపీలో చోటు చేసుకుంది. శుక్రవారం ఊహించని రీతిలో శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (Blue Whale) కొట్టుకు వచ్చింది.
ఈ నీలి తిమింగలం సుమారు 25 అడుగుల పొడవు , ఏకంగా 5 టన్నుల బరువు కలిగి ఉంటుందని అంచనా. ఈ చేపలు బంగాళా ఖాతంలో అరుదుగా ఉంటాయని మత్స్య కారులు భావిస్తున్నారు. అనుకోకుండా ఒడ్డుకు వచ్చి ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నీలి తిమింగలం ను చూసేందుకు జనం తరలి వస్తున్నారు. మొత్తంగా వర్షాల , వాయుగుండం పుణ్యమా అని ఇంకెన్ని చేపలు బయటకు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
Also Read : Warangal Heavy Rains : ఓరుగల్లును ముంచెత్తిన వాన