Telangana DGP Salute : పోలీసుల‌కు డీజీపీ సెల్యూట్

ట్విట్ట‌ర్ వేదిక‌గా కంగ్రాట్స్

Telangana DGP Salute : తెలంగాణ రాష్ట్రాన్ని వ‌ర్షాలు ముంచెత్తాయి. చాలా చోట్ల వాగులు, వంక‌లు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. ప‌లువురు గ‌ల్లంత‌య్యారు. మ‌రికొంద‌రు వ‌ర‌ద ఉధృతిలో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ , అగ్ని మాప‌క ద‌ళాల‌తో పాటు రాష్ట్రానికి చెందిన పోలీసులు బాధితుల‌ను ఆదుకున్నారు. వారిని కాపాడారు. ఇందుకు సంబంధించి విప‌త్తు వేళ త‌మ కుటుంబాల‌ను వ‌దిలి వేసి విద్యుక్త ధ‌ర్మాన్ని నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కు తాను శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు తెలంగాణ డీజీపీ(Telangana DGP) అంజ‌నీ కుమార్.

Telangana DGP Salute To

ఎంద‌రినో ర‌క్షించార‌ని వారంద‌రికీ పేరు పేరునా తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా అరుదైన దృశ్యాల‌ను, ఫోటోల‌ను పంచుకున్నారు. మీ ప‌ట్టుద‌ల‌, సాహ‌సం, ధైర్యం, వృత్తి ప‌ట్ల మీకున్న నిబ‌ద్ద‌త త‌న‌ను ఎంత‌గానో సంతోషానికి లోను చేసింద‌ని స్పష్టం చేశారు తెలంగాణ డీజీపీ.

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న 50 మందిని పోలీసులు ర‌క్షించార‌ని, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించార‌ని తెలిపారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే భ‌గ‌త్ సింగ్ కాల‌నీ, కాక‌తీయ యూనివ‌ర్శిటీ కాలేజీ ప్రాంతంలో వ‌ర‌ద ముంచెత్తింద‌ని , ఇళ్ల‌ల్లో చిక్కుకు పోయిన 20 కుటుంబాల‌ను ర‌క్షించార‌ని వెల్ల‌డించారు డీజీపీ. అంతే కాదు కొయ్యూరు ఎస్ఐ , సిబ్బందితో క‌లిసి వ‌ర‌ద‌ల్లో చిక్కుకు పోయిన ఇద్ద‌రి ప్రాణాలు కాపాడార‌ని కొనియాడారు.

Also Read : Chandrababu Naidu : సిరులు పండే చోట ర‌క్తం పారిస్తే ఎలా

 

Leave A Reply

Your Email Id will not be published!