Godavari Flood Bhadrachalam : భద్రాచలానికి పోటెత్తిన వరద 3వ ప్రమాద హెచ్చరిక
3వ ప్రమాద హెచ్చరిక జారీ
Godavari Flood Bhadrachalam : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. దీంతో భారీ ఎత్తున అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు చేరింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించి పోయింది. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, ఎత్తిపోతల పథకాలు , భారీ ప్రాజెక్టులన్నీ నిండు కుండల్ని తలపింప చేస్తున్నాయి.
Godavari Flood Bhadrachalam In Danger
కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉగ్ర రూపం దాల్చేందుకు రెడీగా ఉంది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద నీటి ప్రవాహం చేరుకుంది(Godavari Flood Bhadrachalam). 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 54.4 అడుగులకు చేరింది.
ఇక ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ , ఔట్ ఫ్లో 13.54 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో నిమగ్నం అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్.
సముద్ర తీర ప్రాంతాలకు చేపలు పట్టేందుకు వెళ్లే మత్స్యకారులు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని సూచించారు. పరిస్థితులు కుదట పడేంత దాకా తమ తమ ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. మరో వైపు ఏపీ సీఎం జగన్ రెడ్డి సమీక్ష చేపట్టారు.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు