Ambati Rambabu : దమ్ము లేనోడు పవన్ – అంబటి
పవన్ కళ్యాణ్ పై మంత్రి సెటైర్లు
Ambati Rambabu : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రో సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తనతో ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక పవన్ కళ్యాణ్ శునకానందం పొందుతున్నాడంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.
Ambati Rambabu Comments
బ్రో తాజా చిత్రంలో సంబరాల శ్యాంబాబు పేరుతో క్యారెక్టర్ సృష్టించారని , తనను కేవలం టార్గెట్ చేసినంత మాత్రాన ఏమీ కాదన్నారు. ఇలాంటి పనికిమాలిన , నీతి మాలిన , వెగటు కలిగించే పాత్రలు ఎన్ని చేసినా తన క్యారెక్టర్ ఇసుమంత డ్యామేజ్ చేయలేరన్నారు అంబటి రాంబాబు.
దమ్మున్నోడివైతే బహిరంగంగా ఎదుర్కోవాలని కానీ ఇలా ఏవో పాత్రలు సృష్టించి ఆనందం పొందాలని అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదన్నారు మంత్రి. తాను ఏమీ ప్యాకేజీలు తీసుకునే స్టార్ ను కాదన్నారు. ఎవరు ఎవరి వైపు ఉన్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అందుకే ఓట్లతో గత ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఇచ్చారని స్పష్టం చేశారు అంబటి రాంబాబు. తనతో ఎదుర్కోలేకనే బ్రో సినిమాలో తన పేరుతో ఓ క్యారెక్టర్ సృష్టించాడని మండిపడ్డారు.
Also Read : Revanth Reddy : పిండ ప్రదానం చేస్తేనే శాంతి – రేవంత్