Telangana High Court : తెలంగాణ సర్కార్ పై హైకోర్టు గుస్సా
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఎక్కడ
Telangana High Court : ఓ వైపు రాష్ట్రం వర్షాల దెబ్బకు తల్లడిల్లి పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది తెలంగాణ హైకోర్టు. శనివారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు సర్కార్ ఏం చేస్తోందంటూ ప్రశ్నించింది. ఒక రకంగా నిలదీసింది. ఓ వైపు వరదల ఉధృతికి పలువురు మరణించారు. మరికొందరు గల్లంతయినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా ఒక బాధ్యత కలిగిన సర్కార్ రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Telangana High Court Asking
వరద ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ధర్మాసనం(Telangana High Court) నిలదీసింది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఎందుకని ఆలస్యం జరిగింది. యంత్రాంగం నిద్ర పోతోందా అంటూ మండిపడింది కోర్టు.
నీటి ప్రాజెక్టుల పరిధిలో ముంపునకు గురైన వారిని సహాయక ప్రాంతాలకు తరలించారా అని ప్రశ్నించింది. దీనికి వెంటనే సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వర్షాలు, తీసుకున్న చర్యలకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
మరో వైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి కేసీఆర్ ప్రభుత్వంపై. చిన్నపాటి చినుకులకే హైదరాబాద్ వణుకుతోందని ఆరోపించాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఏకంగా కేసీఆర్, కేటీఆర్, ప్రభుత్వానికి పిండ ప్రదానం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : Godavari Floods : గోదావరి దెబ్బ వలస బాట