BJP Focus : సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్
జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు
BJP Focus : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కీలక మార్పులు చేసింది. ప్రధానంగా మరోసారి పవర్ లోకి వచ్చేలా పావులు కదుపుతోంది. పలువురికి స్థాన భ్రంశం కల్పించింది. తారిఖ్ మన్సూర్ ను బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ను చేసింది. అబ్దుల్లా కుట్టి కూడా ఇప్పటికే ఉన్నారు. మైనార్టీలకు ప్రయారిటీ ఇచ్చింది.
BJP Focus On Changes
మన్సూర్ గతంలో అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయానికి వీసీగా గతంలో పని చేశారు. తెలంగాణ బీజేపీ(BJP) చీఫ్ నుంచి తొలగించిన బండి సంజయ్ కుమార్ పటేల్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. కాగా కర్ణాటకకు చెందిన సిటీ రవి, అస్సాం నుంచి ఎంపీ దిలీప్ సైకియా, యూపీ నుండి ఎంపీలు వినోద్ సోంకర్ , హరీష్ ద్వివేది, సునీల్ దేవధర్ లను తొలగించారు.
రాధా మోహన్ అగర్వాల్ కు పదోన్నతి లభించింది. కొత్త కార్యదర్శులుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనికి చోటు దక్కింది. కామాఖ్య ప్రసాద్ ఉన్నారు. 13 మంది ఉపాధ్యక్షులు , 9 మంది ప్రధాన కార్యదర్శులు, సంస్థ ఇన్ ఛార్జిగా బీఎల్ సంతోష్ కీలకంగా మారనున్నారు. రాధా మోహన్ సింగ్ ను తప్పించారు.
డీకే అరుణకు పదోన్నతి లభించింది. రమన్ సింగ్ , వసుంధర రాజే, రఘుబర్ దాస్ లు ఇప్పటికే ఉన్నారు. అరుణ్ సింగ్ , కైలాష్ విజయ వర్గీయ, దుష్యంత్ కుమార్ గౌతమ్ , తరుణ్ చుగ్ , సునీల్ బన్సాల్ , వినోద్ తాన్డే ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారు. మొత్తంగా కార్యవర్గంలో మార్పులు రేపటి ఎన్నికల కోసమేనని చెప్పక తప్పదు.
Also Read : Ambati Rambabu Slams : బాబు బతుకంతా అబద్దాలమయం