Brahmanandam KCR : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (కన్నెగంటి బ్రహ్మానంద చారి) తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిశారు. కుటుంబ సమేతంగా విచ్చేశారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఫ్యామిలీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన తనయుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. పెళ్లి పత్రికను కేసీఆర్ దంపతులకు అందజేశారు. సతీసమేతంగా రావాలని, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు బ్రహ్మానందం దంపతులు.
Brahmanandam KCR Meet
ఇదిలా ఉండగా తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న అరుదైన నటుడు బ్రహ్మానందం అంటే విపరీతమైన అభిమానం సీఎం కేసీఆర్ కు. ఆయన నటుడే కాదు సాహిత్య రంగంలో ఘనాపాటి కూడా. మరో వైపు కేసీఆర్(KCR) కూడా సాహిత్య పిపాసి. ఆయనకు కవులన్నా, రచనలన్నా, సాహిత్యం అన్నా, గాయకులన్నా, నటులన్నా ఇష్టపడతారు. వారిని ప్రోత్సహిస్తారు సీఎం.
ప్రత్యేకంగా తనకు ఆహ్వానం ఇచ్చేందుకు వచ్చిన దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం, భార్యను కేసీఆర్ దంపతులు ఘనంగా సన్మానించారు. తాము కుటుంబ సమేతంగా విచ్చేస్తామని తెలిపారు. మీలాంటి అరుదైన నటుడు తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
Also Read : BTech Ravi : అజయ్ కల్లాంపై బిటెక్ రవి ఫైర్