PSLV-C56 Launch : పిఎస్‌ఎల్‌వి సి-56 స‌క్సెస్

అభినందించిన సీఎం జ‌గ‌న్

PSLV-C56 Launch : ఆంధ్రప్ర‌దేశ్ లోని శ్రీ‌హ‌రి కోట నుంచి 7 సింగ‌పూర్ ఉప గ్ర‌హాల‌ను విజ‌య‌వ‌తంగా అంత‌రిక్షంలోకి తీసుకు వెళ్లింది. ఉప‌గ్ర‌హాల ప్ర‌యోగాలు స‌క్సెస్ కావ‌డంతో శ్రీ‌హ‌రి కోట‌లో సంబురాలు మిన్నంటాయి. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని, ఇస్రో చైర్మ‌న్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

PSLV-C56 Launch Event

పీఎస్ఎల్వీ-సి56(PSLV-C56 Launch) పేరుతో శ్రీ‌హ‌రికోట లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ (ఎస్డీఎస్సీ) లోని మొద‌టి లాంచ్ ప్యాడ్ (ఎఫ్ఎల్పీ) నుండి ప్ర‌యోగించారు. ఆదివారం ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఈ ప్ర‌యోగాన్ని ప్రారంభించారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా క‌క్ష్య లోకి దూసుకు వెళ్లింద‌ని ఇస్రో వెల్ల‌డించింది.

ఈ పీఎస్ఎల్వీ రాకెట్ తో ఇస్రో నుంచి ప్ర‌యోగించిన ఉప్ర‌గాహాల సంఖ్య 58కి చేరుకున్నాయి. కోర్ అలోన్ కాన్ఫిగ‌రేష‌న్ ని ఉప‌యోగించింది 17వ‌ది కావ‌డం విశేషం. కాగా పీఎస్ఎల్వీ56, డీఎస్ -ఎస్ఏఆర్ అనేది సింగ‌పూర్ లోని ఎస్టీ ఇంజ‌నీరింగ్ కోసం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ కు చెందిన వాణిజ్య మిష‌న్ కు చెందింది. సింగ‌పూర్ కు చెందిన ఆరు స‌హ ప్యాసింజ‌ర్ క‌స్ట‌మ‌ర్ ఉప‌గ్రహాలు కూడా ఉన్నాయి. అన్ని ఉప‌గ్ర‌హాలు 535 కిలోమీట‌ర్ల వృత్తాకారానికి 5 క‌క్ష్య‌లోకి ఇంజెక్ట్ చేయ‌బ‌డ‌తాయి.

Also Read : Godavari Water Flow : గోదావ‌రి ఉగ్ర‌రూపం అంత‌టా అప్ర‌మ‌త్తం

Leave A Reply

Your Email Id will not be published!