Car Accdent Tankbund : ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం
కారును వదిలి పరారైన ఇద్దరు
Car Accdent Tankbund : హైదరాబాద్ లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు మరింత పెరిగాయి. విపరీతమైన వేగం ప్రాణాలను హరిస్తోంది. ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) ఎంతగా కఠినంగా అమలు చేస్తున్నా వాహనదారులు పట్టించు కోవడం లేదు. మినిమం స్పీడ్ తో వెళ్లాలని , నగరంలో ట్రాఫిక్ రద్దీగా ఉంటుందని పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా స్పందించడం లేదు.
Car Accdent Tankbund City
ఆదివారం హైదరాబాద్ లోని ఎప్పటికీ రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వచ్చింది ఈ కారు. దీంతో అదుపు తప్పి హుస్సేన్ సాగర్ లోకి దూసుకు వెళ్లింది.
ఇదిలా ఉండగా కారు లోని బెలూన్ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు జంప్ అయ్యారు. అక్కడి నుంచి తప్పించుకున్నారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరి ఆచూకి కోసం నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
ఇలాంటి వారిని భవిష్యత్తులో వాహనాలు నడపకుండా నిషేధం విధించాలని నగర వాసులు కోరుతున్నారు. రాష్ట్ర పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో పలుమార్లు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read : PSLV-C56 Launch : పిఎస్‌ఎల్‌వి సి-56 సక్సెస్