Godavari Water Flow : భద్రచలానికి వరద ఉధృతి
49.5 అడుగులకు చేరిన నీటిమట్టం
Godavari Water Flow : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది, గోదావరి నది పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి(Godavari Water Flow). సోమవారం నుంచి కొంత మేర తగ్గే ఛాన్స్ ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
భద్రాచలం వద్ద రెండవ నీటి మట్టం 49.5 అడుగులకు చేరింది. ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద నిలకడగా ఉంది. ప్రస్తుతానికి ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 16.32 లక్షల క్యూసెక్కులగా ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి.
Godavari Water Flow High
గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంత వాసులు సాధ్యమైనంత మేర పునరావాస కేంద్రాలలోకి వెళ్లడం మంచిదని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తతో ఉండాలని స్పష్టం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.
భారీ వర్షాల తాకిడికి కృష్ణా, గోదావరి నదులు పొంగి పొర్లుతున్నాయి. జూరాల జలాశయం నిండి పోయింది. శ్రీశైలానికి వరద పోటెత్తింది. సుంకేసుల, హంద్రీ నీవా ప్రాజెక్టులు నిండి పోయాయి. తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read : Telangana Police Hats Off Comment : మానవత్వమా వర్ధిల్లుమా