Daggubati purandeswari : పోస్టర్ పై పురందేశ్వరి ఫైర్
ఇదేనా సెక్యులరిజం అంటే
Daggubati purandeswari : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ భరత మాతను చెరచబడుతున్నట్లు పోస్టర్ రూపొందించడం, అది వైరల్ కావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు పురందేశ్వరి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఇదేనా సెక్యులరిజం అని ప్రశ్నించారు.
Daggubati purandeswari Asking
మనం సహనంతో ఉన్నందు వల్ల , మన మత పరమైన భావాలను క్రూరంగా అణిచి వేసే హక్కు విపక్షాల కూటమి ఇండియాకు ఎవరు ఇచ్చారంటూ దగ్గుబాటి పురందేశ్వరి నిలదీశారు. కోట్లాది మంది నిత్యం పూజించే దేవతలను కించ పరుస్తూ పోస్టర్లు వేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్. ఎంఎంకే పార్టీ చీఫ్ ఎంహెచ్ జవహరుల్లా అని తమకు తెలిసిందని , ఆయన రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
పవర్ లో లేనంత మాత్రాన వ్యక్తులను ఇంతలా దిగజార్చేలా, వ్యక్తిగతంగా పోస్టర్లు ఇలా వేస్తారా అంటూ వాపోయారు దగ్గుబాటి పురందేశ్వరి. దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. న్యాయ పరంగా తాము కోర్టుకు వెళతామని స్పష్టం ఏశారు బీజేపీ చీఫ్.
Also Read : CJI Chandrachud : మణిపూర్ హింసపై కేసులు ఎన్ని – సీజేఐ