TTD Srivani Trust : శ్రీవాణి ట్రస్టుపై నిజ నిర్దారణ కమిటీ
ఓకే చెప్పిన టీటీడీ చైర్మన్, ఈవో
TTD Srivani Trust : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి. పూర్తి వివరాలు పారదర్శకంగా ఉన్నాయని, ఇందులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. అయినా పదే పదే శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
TTD Srivani Trust Enquiry
ఇందుకు సంబంధించి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్వయంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తిరిగి శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి పూర్తి వివరాలు బహిరంగ పర్చాలని డిమాండ్ చేయడంతో మొత్తం విరాళాలు, నిధులపై వాస్తవాలు తెలుసు కునేందుకు గాను నిజ నిర్ధారణ కమిటీని స్వాగతిస్తున్నట్లు టీటీడీ(TTD) స్పష్టం చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది.
ఇదిలా ఉండగా శ్రీవాణి ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక పురాతన ఆలయాల జీర్ణోద్దరణ తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి టీటీడీ నిధులు అందజేస్తోంది. అంతే కాకుండా ఆయా ప్రాంతాల్లో ధూప దీప నైవేద్యాలకు ఆర్థిక సహాయం కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్టుపై శ్వేత పత్రం విడుదల చేశారు.
Also Read : Garuda Seva : శ్రీవారి ఆలయంలో గరుడసేవ.. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది