TTD JEO : శుద్ద తిరుమ‌ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాలి

టీటీడీ జేఈవో స‌దా భార్గ‌వి

TTD JEO : ఆగ‌స్టు 12న నిర్వ‌హించ‌నున్న శుద్ద తిరుమ‌ల – సుంద‌ర తిరుమ‌ల కార్య‌క్ర‌మాన్ని చ‌క్క‌గా నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీడీ జేఈవో(TTD JEO) స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో శుక్ర‌వారం జేఈవో ఈ అంశంపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా స‌దా భార్గ‌వి మాట్లాడారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకు ఈవో ధ‌ర్మా రెడ్డి పిలుపు మేర‌కు ఈ ఏడాది మే 13న తొలిసారిగా నిర్వ‌హించిన శుద్ద తిరుమ‌ల సుంద‌ర తిర‌ముల కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌ని అన్నారు.

TTD JEO Instructs

12న విద్యార్థినీ విద్యార్థుల‌తో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాన్ని కూడా ఇదే త‌ర‌హాలో స‌క్సెస్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు జేఈవో. టీటీడీ కాలేజీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఇత‌ర విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా చూడాల‌న్నారు. మొద‌టి, రెండో ఘాట్ రోడ్లు, రెండు న‌డ‌క దారుల‌ను ఏడు సెక్టార్లుగా విభ‌జించి ఒక్కో సెక్టారుకు ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని ఆదేశించారు స‌దా భార్గ‌వి.

విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన తాగు నీరు, ఆహారం, టీ , స్నాక్స్ ఆయా కాలేజీలు ప్రిన్సిపాళ్లు తిరుప‌తి అన్న‌దానం విభాగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని ఏర్పాటు చేయాల‌న్నారు. చెత్త వేసే క‌వ‌ర్లు, డ‌స్ట్ బిన్లు, డిస్పోజ‌ల్ మాస్క్ లు , ప‌ర‌క‌లు, గ్లౌజులు సిద్దం చేయాల‌ని హెల్త్ ఆఫీస‌ర్ ను ఆదేశించారు.

Also Read : TTD EO : శ్రీ‌వారి సేవ‌కు డ‌బ్బులు అక్క‌ర్లేదు – ఈవో

Leave A Reply

Your Email Id will not be published!