Buggana Rajendranath Reddy : రూ. 200 కోట్లతో 50 సబ్ ట్రెజరీలు
ఏపీ మంత్రి బుగ్గున రాజేంద్ర నాథ్ రెడ్డి
Buggana Rajendranath Reddy : ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 200 కోట్లతో 50 ఉప ఖజానా కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రూ. 120 కోట్లతో ఇప్పటికే 30 కార్యాలయాల నిర్మాణం పూర్తైనట్లు తెలిపారు. శుక్రవారం విజయనగరం జిల్లాలో రూ. 15 కోట్లతో నిర్మించిన సమీకృత ఆర్థిక శాఖ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
Buggana Rajendranath Reddy Said
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ది కల్పనకు కంకణం కట్టుకుందని, అందుకు ఈ భవనమే నిదర్శనమని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చొరతో ఏపీ స్టేట్ ఆర్కిటెక్చర్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భవన ఆకృతులను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
మంచితనం, మర్యాదలో ఉత్తరాంధ్ర స్థానం వేరని , సర్వ సాధరణంగా , కష్ట జీవులుగా కల్మషం లేకుండా ఇక్కడి ప్రజలు ఉంటారని మంత్రి అన్నారు. త్వరలోనే నగరంలోని 40 ఏళ్ల కిందట నిర్మించిన పాలిటెక్నిక్ కాలేజీలో ఆధునీకరణ పనులు చేపడతామని బుగ్గన చెప్పారు.
Also Read : TTD JEO : శుద్ద తిరుమలకు చర్యలు తీసుకోవాలి