Centre NDRF Release : ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల
దేశంలోని రాష్ట్రాలకు తీపికబురు
Centre NDRF Release : కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్(NDRF Release) నిధులను మంజూరు చేసింది. ఇదిలా ఉండగా 2015 నుండి 2023 వరకు ఆయా రాష్ట్రాల వారీగా కేంద్రం నిధులను విడుదల చేసింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి.
Centre NDRF Release Funds
మహారాష్ట్రకు రూ. 12,754 కోట్లు, కర్ణాటక రాష్ట్రానికి రూ. 12,271 కోట్లు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రూ. 6,916 కోట్లు , తమిళనాడుకు రూ. 4,919 కోట్లు , ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ. 4, 644 కోట్లు , పశ్చిమ బెంగాల్ కు రూ. 4,619 కోట్లు , బీహార్ రాష్ట్రానికి రూ. 4,610 కోట్లు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 3,643 కోట్లు , తెలంగాణ రాష్ట్రానికి రూ. 854 కోట్లు విడుదల చేసింది మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.
ఈ నిధులు ఆయా రాష్ట్రాలు వాడుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేయడం పట్ల ఆయా రాష్ట్రాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది 2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఈ నిధులు విడుదల చేసిందా అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా నిధుల వరద పారించింది కేంద్రం.
Also Read : Posani Krishna Murali : జగన్ దమ్మున్నోడు – పోసాని