Daggubati Purandeswari : పుంగనూరు ఘటన బాధాకరం
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : పుంగనూరులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో చోటు చేసుకున్న అల్లర్లు, దాడులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari). శనివారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ విఫలమైందని దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతుందన్నారు.
Daggubati Purandeswari Comments
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఉండాలని మిగతా ప్రతిపక్షాలు లేకుండా చూడాలని అనుకోవడం దారుణమన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇంత జరుగుతున్నా ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందారు దగ్గుబాటి పురందేశ్వరి.
ఇదిలా ఉండగా పుంగనూరులో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో వైసీపీ శ్రేణులు, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున తోపులాట, ఆపై ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వారు, పోలీసులపై దాడికి పాల్పడడం విస్తు పోయేలా చేసింది.
దీనిపై పుంగనూరు జిల్లా ఎస్పీ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకోలేదన్నారు.
Also Read : TSRTC Protest : గవర్నర్ కు ఆర్టీసీ ఉద్యోగుల అల్టిమేటం