Mallu Bhatti Vikramarka : పంతుళ్లు లేక పరేషాన్ – భట్టి
వెంటనే డీఎస్సీ ప్రకటన చేయండి
Mallu Bhatti Vikramarka : రాష్ట్రంలో విద్యా రంగం పడకేసింది. ఒక రకంగా పనిగట్టుకుని విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు. ఇది మంచి పద్దతి కాదు. అణగారిన వర్గాలకు విద్యను అందకుండా దూరం చేసే కుట్ర జరుగుతోంది. ఇన్నేళ్లయినా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది పరిస్థితి. ఇప్పటి వరకు టీచర్లను నియమించిన దాఖలాలు లేవు. డీఎస్సీ ప్రకటన వేయలేదు. దీని వల్ల టీచర్ పోస్టుల భర్తీ కాకుండా ఆగి పోయిందని, వెంటనే డీఎస్సీ పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka).
Mallu Bhatti Vikramarka Asking
ప్రత్యేకించి రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల హవా కొనసాగుతోందన్నారు. వాటిని నియంత్రించే మెకానిజం లేక పోవడం విడ్డూరంగ ఉందన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు భట్టి విక్రమార్క.
ప్రైవేట్ విద్యా సంస్థలు దారి దోపిడీ దొంగలుగా వ్యవహరించినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రైత్యేకించి దర్జాగా ఫీజుల వసూలుకు తెర తీశారని , పేదలు చదువుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ బడుల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒకరే టీచర్ బోధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సర్కార్ ఫోకస్ పెట్టాలని పంతుళ్లను భర్తీ చేయాలని కోరారు.
Also Read : Bandi Sanjay : ఆర్టీసీని నిర్వర్యం చేసిన కేసీఆర్