RTC Chalo Raj Bhavan : ఆర్టీసీ ఉద్యోగుల ఛలో రాజ్ భవన్
నాయకులు రావాలని ఆహ్వానం
RTC Chalo Raj Bhavan : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తెలంగాణ సర్కార్ బిల్లును రూపొందించింది. ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం పొందేందుకు రాజ్ భవన్ కు పంపింది. కానీ అక్కడి నుంచి బిల్లుపై ఎలాంటి సంతకం పెట్టలేదు. దీంతో బిల్లుకు గవర్నర్ అడ్డుకుంటోందంటూ పెద్ద ఎత్తున ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చందంగా ఆందోళన బాట పట్టారు. వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఇవాళ పూర్తి బంద్ పాటిస్తామని, గవర్నర్ దిగి వచ్చేంత దాకా తమ పోరాటం ఆగదని ప్రకటించారు ఆర్టీసీ యూనియన్ నేతలు.
RTC Chalo Raj Bhavan Program
దీంతో రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్(RTC Chalo Raj Bhavan) కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ బిల్లుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్టీసీ యూనియన్ కు చెందిన 10 మంది నేతలు తనతో మాట్లాడేందుకు రావాలని ఆహ్వానం పంపారు గవర్నర్. రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Also Read : Kangana Ranaut Chandramukhi-2 : కంగనా లుక్ అదుర్స్