Peddireddy Ramachandra Reddy : హింసకు చంద్రబాబే కారణం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
Peddireddy Ramachandra Reddy : ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో చోటు చేసుకున్న ఘటనలకు, అల్లర్లకు, హింసకు ప్రధాన కారకుడు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.
Peddireddy Ramachandra Reddy Comments
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పక్కా స్కెచ్ తోనే టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు దాడులు చేయించాడని ఆరోపించారు. పుంగనూరు పట్టణానికి చంద్రబాబు రావడం లేదని, బైపాస్ లో వెళతారంటూ మొదట పోలీసులకు సమాచారం ఇచ్చారని అన్నారు. ఆ తర్వాత రూట్ మార్చారని ఆరోపించారు.
ఈ మేరకు పోలీసులు 400 మందితో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి(Peddireddy Ramachandra Reddy). కానీ ఉన్నట్టుండి ఎందుకు పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు రావాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఆయన వల్లనే ఈ హింస చోటు చేసుకుందని ధ్వజమెత్తారు.
బాబు హయాంలో తమ ప్రాంతానికి ఎలా అన్యాయానికి గురి చేశాడనే విషయంపై నిలదీసేందుకు వైసీపీ శ్రేణులు ఉదయం 10.30 గంటల దాకా వేచి ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత వీళ్లు వెళ్లాక పుంగనూరు లోకి ఎంటర్ అయ్యాడని, ఆతర్వాత ఘర్షణలు చోటు చేసుకున్నాయని మంత్రి చెప్పారు. పోలీసులపై కూడా దాడులు చేశారని ఇది మంచి పద్దతి కాదన్నారు.
Also Read : Nara Lokesh : జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ