Janasena NRI : జనసేనకు ఎన్నారైలు కోటి విరాళం
పవన్ కళ్యాణ్ కు చెక్కును అందజేత
Janasena NRI : జనసేన పార్టీ ప్రవాస భారతీయుల గల్ఫ్ విభాగం ప్రతినిధులు శనివారం పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు తమ అధ్యక్షుడితో ముచ్చటించారు. ప్రధాన సమస్యలపై వారు ప్రస్తావించారు. రాష్ట్రంలో జనసేన(Janasena) పార్టీ పవర్ లోకి రావాలని ఆకాంక్షించారు. ఇందు కోసం తాము ఏమైనా సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎప్పుడైనా సరే తాము కూడా వచ్చి చేరుతామని, ప్రచారం కూడా చేస్తామని హామీ ఇచ్చారు.
Janasena NRI Fund
ఈ సందర్బంగా జనసేన పార్టీ చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రవాస భారతీయులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా జనసేన జెండా ఎగురాలని పిలుపునిచ్చారు.
పార్టీ ఎక్కడ ఉన్నా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుందని, దాని కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్నా సరే జనసేన ఎన్నారై విభాగానికి చెందిన ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచు కోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు పార్టీ పరంగా టికెట్లు ఇచ్చే టప్పుడు , ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఎవరి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు
జనసేనాని. అనంతరం ఎన్ఆర్ఐ జనసేన గల్భ్ విభాగం సభ్యులు రూ. 1 కోటి విరాళాన్ని పార్టీ కోసం అందజేశారు. ఈ మేరకు చెక్కును పవన్ కు ఇచ్చారు.
Also Read : Dk Shiva kumar : బొంబట్ ఆతిథ్యం డీకే సంతోషం