TS Governor RTC : ఆర్టీసీ బిల్లు ఆమోదానికి ఓకే ..?
కాసేపట్లో ఓకే చెప్పనున్నట్లు టాక్
TS Governor RTC : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తూ రూపొందించిన బిల్లుపై సంతకం చేయకుండా నాన్చడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టారు. డిపోలలో బస్సులు నిలిచి పోయాయి. బిల్లును ఆమోదించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ ఛలో రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది గవర్నర్ నివాస భవనానికి చేరుకున్నారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
TS Governor RTC Bill
బిల్లుపై తనకు అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకున్నాక తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే పలు బిల్లులు నిలిచి పోయాయి. చాలా ఫైళ్లకు మోక్షం లభించక పోవడంపై తెలంగాణ సర్కార్ గవర్నర్ తమిళి సై(Tamilisai Soundararajan) పట్ల గుర్రుగా ఉన్నారు.
రాజ్ భవన్ వద్దకు భారీగా చేరుకున్న ఉద్యోగులను చూసి చలించి పోయారు. తాను ఎవరి పట్లా వ్యతిరేకత కాదన్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు , సంస్థతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గవర్నర్. తమిళి సై ప్రస్తావించిన ఐదు అంశాలకు సంబంధించి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సంస్థ , ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా సాధ్యమైనంత మేరకు బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.
Also Read : Imran Khan : నా అరెస్ట్ ఊహించిందే – ఇమ్రాన్ ఖాన్