KTR : చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
పిలుపునిచ్చిన మంత్రి కేటీ రామారావు
KTR : మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆరోజు ప్రభుత్వం నేతన్నల కోసం పలు కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు మంత్రి. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలోనే చేనేతల అభివృద్ది కోసం వినూత్న పథకాలను తీసుకు వచ్చిందన్నారు. చేనేతల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత తమదేనని పేర్కొన్నారు.
KTR Write Instructions
చేనేత, జౌళి రంగానికి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతి ఏటా బడ్జెట్ లో రూ. 1200 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రం ఇలా కేటాయించ లేదని గుర్తు చేశారు కేటీఆర్(KTR). అప్పుల ఊబిలో కొట్టుకు పోతూ ఆత్మహత్యలకు పాల్పడకుండా తీసుకున్న రుణాలను మాఫీ చేసిందన్నారు.
2010 నుంచి ఉన్న లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడంతో రాష్ట్రంలోని 10,148 మంది కార్మికులు రూ. 28.17 కోట్ల రుణాల నుండి విముక్తి పొందారని తెలిపారు కేటీఆర్. చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటి దాకా 22 వేల మంది నేతన్నలకు సుమారు 90 కోట్ల సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లోనే అందుకున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు కూడా రూ. 5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు కేటీఆర్.
Also Read : TS Governor RTC : ఆర్టీసీ బిల్లు ఆమోదానికి ఓకే ..?