MLC Kavitha Students : ఎమ్మల్సీ కవితకు విద్యార్థులు థ్యాంక్స్
శాసన మండలిని చూపించిన ఎమ్మెల్సీ
MLC Kavitha Students : ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థినుల చిరకాల కోరికను నెరవేర్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శనివారం విద్యార్థులను వెంట బెట్టుకుని శాసన మండలిని చూపించారు. ఈ సందర్బంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పరిచయం చేశారు. సమావేశాల ఎలా జరుగుతాయి. ఎవరు నిర్వహిస్తారు. శాసన మండలి సభ్యులను ఎవరు నామినేట్ చేస్తారు. ఎన్నుకుంటారా లేక నామినేట్ చేయబడతారా , స్పీకర్ ను ఎవరు ఎన్నుకుంటారు. స్పీకర్ బాధ్యతలు ఏమిటి..? ఏయే సౌకర్యాలు ఉంటాయి ఎమ్మెల్సీలకు , తదితర విషయాలను విద్యార్థులకు వివరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
MLC Kavitha Students Interaction
ఈ సందర్భంగా విద్యార్థుల కోరిక మేరకు టీచర్లు కూడా విచ్చేశారు. వారు కూడా కవిత(MLC Kavitha)తో కలిసి శాసన మండలిని చూశారు. కవితకు ధన్యవాదాలు తెలిపారు. భావి భారత పౌరులుగా తయారు కావాలని సూచించారు కవిత. చదువుపై దృష్టి పెట్టాలని, ఇతర విషయాలను పట్టించు కోకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిందని, దానిని గుర్తించి అందిపుచ్చుకుంటే ఉపాధి అవకాశాలు అందుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు కవిత.
ఇదిలా ఉండగా ఎప్పుడూ బిజీగా ఉండే ఎమ్మెల్సీ తమకు టైం ఇచ్చి శాసన మండలిని చూపించినందుకు సంతోషానికి లోనయ్యారు విద్యార్థులు.
Also Read : KTR : చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి